Monday, June 8, 2026
HomeMovie Newsఏడాదిలో 5 పాత్రలు.. రష్మిక వర్సటైల్ షో!

ఏడాదిలో 5 పాత్రలు.. రష్మిక వర్సటైల్ షో!

rashmika-mandanna-five-versatile-roles-in-one-year

ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవుతారనే అభిప్రాయం ఉండేది. కానీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆ అపోహను బ్రేక్ చేస్తూ, నటిగా తన సత్తా చాటుతోంది. కేవలం 11 నెలల వ్యవధిలోనే ఐదు పూర్తిగా విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించింది.

‘పుష్ప 2’లో ‘శ్రీవల్లి’గా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న రష్మిక, ఆ వెంటనే ‘ఛావా’ చిత్రంలో ‘యేసుబాయ్’గా చారిత్రక పాత్రలో రాజసం ఒలకబోసింది. ఈ రెండు పాత్రలూ ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి.

‘కుబేర’ సినిమాలో ‘సమీరా’గా, రెగ్యులర్ హీరోయిన్ పాత్రకు భిన్నంగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇక ఆయుష్మాన్ ఖురానా ‘థామా’ చిత్రంలో ‘బేతాళ’ పాత్రతో హారర్ టచ్ ఇచ్చి భయపెట్టింది.

ఇటీవల విడుదలైన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో, టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకున్న ఇన్నోసెంట్ అమ్మాయి ‘భూమా’గా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇది ఆమె కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది.

ఈ ఐదు విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా, ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం రష్మిక స్టార్‌డమ్‌కు నిదర్శనం. ప్రస్తుతం ఆమె ‘మైసా’, ‘రెయిన్‌బో’ వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular