
న్యూస్ డెస్క్: ఆసియా కప్ జట్టులో చోటు దక్కక నిరాశ చెందిన శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియా-Aతో జరగనున్న సిరీస్ కోసం ఆయనను ఇండియా-A కెప్టెన్‌గా నియమించడం అనూహ్య పరిణామంగా మారింది.
ఈ నిర్ణయం ఆయన కెరీర్‌కు మళ్లీ ఊపు తీసుకొచ్చినా, మరోవైపు కరుణ్ నాయర్ భవిష్యత్తుపై సందేహాలు తలెత్తుతున్నాయి. జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశమిస్తూనే, నాయర్‌ను పక్కన పెట్టడం ఆయనకు వెనుకడుగు వేసినట్లే.
గతంలోనూ అవకాశాలు ఇచ్చినా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటమే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన విశ్లేషణలో, సెలక్టర్లు నాయర్‌ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. అదే సమయంలో అయ్యర్‌కు ఇచ్చిన ఈ అవకాశం, ఆయన టెస్టు జట్టులో తిరిగి ప్రవేశానికి సంకేతమని అన్నారు.
రాబోయే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అయ్యర్ తిరిగి టెస్టు బరిలో కనిపించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద, అయ్యర్ నియామకం ఆయన కెరీర్‌కు మలుపు అయితే, నాయర్ కెరీర్‌పై చీకటి కమ్ముకున్నట్లే కనిపిస్తోంది.