
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం పూర్తి స్పీడ్‌లో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయనకు ఇప్పటికే మూడేళ్ల వరకు సినిమా షెడ్యూల్ ఫుల్‌గా బుక్ అయిపోయింది. దీంతో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న కాంతార 3 సినిమాలో తారక్ నటిస్తారన్న గాసిప్‌పై సందేహాలు మొదలయ్యాయి.
బెంగళూరు వర్గాల సమాచారం మేరకు తారక్, రిషబ్ శెట్టిల మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ, ప్రస్తుతం కలిసి చేసే ప్రాజెక్ట్ ఏదీ ప్లాన్‌లో లేదని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి చేయకపోవచ్చు అనేది కాదు.. కానీ ఇప్పటివరకు ఏమీ నిర్ణయించలేదు.
తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం 2026లో విడుదల కానుంది. అదే సమయంలో దేవర 2 కోసం కొరటాల శివతో మరో సినిమా ప్లాన్‌లో ఉంది. వీటితోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ ప్యాన్ ఇండియా మూవీకి తారక్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇంతకూ తారక్ లైనప్‌లో ఇప్పటికే నాలుగు మేజర్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కూడా ఆలస్యం అయితే.. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేయాల్సిన సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కలిపి ఐదు సినిమాలు తారక్ షెడ్యూల్‌ను పూర్తిగా ఆక్రమించనున్నాయి.