
న్యూస్ డెస్క్: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన టెస్టు కెరీర్‌లో అద్భుత ఘనత సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో గిల్ 269 పరుగులు చేసి డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఈ స్కోరుతో టెస్టుల్లో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(254 నాటౌట్) రికార్డును అధిగమించిన గిల్, చరిత్రలోకి ఎక్కాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ అద్భుత ప్రదర్శన అనంతరం గిల్ మాట్లాడుతూ, “ఒత్తిడిని పక్కనబెట్టి చిన్నప్పుడు ఆడినట్లుగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాను. అదే నాకు ఫలితమిచ్చింది” అని అన్నాడు.
తన బేసిక్ స్టెప్స్ పై ఫోకస్ పెంచడంతో పాటు, గౌతమ్ గంభీర్ సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గిల్ వెల్లడించాడు.
“వికెట్ బాగుంది కాబట్టి, ఓపికతో ఆడాలనుకున్నాను. గత మ్యాచ్ అనుభవం ఎంతో ఉపయోగపడింది” అని గిల్ వివరించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో గిల్ సేనా (SENA) దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.