Tuesday, September 1, 2026
HomeMovie Newsబిగ్ బాస్ 9.. ఈసారి సామాన్యులకు కూడా అవకాశం!

బిగ్ బాస్ 9.. ఈసారి సామాన్యులకు కూడా అవకాశం!

bigg-boss-9-telugu-nagarjuna-and-common-man-entry

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తయిన ఈ షో, తొమ్మిదవ సీజన్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వెలువడింది.

ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే కొనసాగించనున్నారు. గత సీజన్లలో ఆయన నడిపించిన విధానం ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌కి సంబంధించి మేకర్స్ ఇచ్చిన సర్‌ప్రైజ్ అప్డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఈసారి షోలో ప్రత్యేకత ఏమిటంటే, సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. జియో సినిమాస్, హాట్ స్టార్ ద్వారా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మేకర్స్ స్పష్టం చేశారు.

ఇదే నిజంగా కామన్ ఆడియెన్స్‌కు బిగ్ బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టే అరుదైన అవకాశం అని చెప్పొచ్చు. ఇది ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే ఎవరెవరు ఈ సీజన్‌కి ఎంట్రీ ఇస్తారన్నది కూడా భారీ చర్చకు దారి తీస్తోంది. ఇంకొన్ని రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular