
రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీకి తెలుగులో భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. జైలర్ హిట్ తర్వాత తలైవా సినిమా కావడం, లోకేశ్ బ్రాండ్ స్టైల్‌తో యూత్ కనెక్ట్ అవ్వడం కారణంగా ఈ మూవీపై బజ్ పెరిగింది.
ఇందులో నాగార్జున పాత్ర ఉండటంతో టాలీవుడ్ మార్కెట్లో మరింత క్రేజ్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూలీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.80-85 కోట్ల గ్రాస్ అన్న టాక్ వినిపిస్తోంది.
అంటే థియేట్రికల్ బిజినెస్ రూ.40 కోట్లు దాటే అవకాశం ఉంది. జైలర్ గతంలో రూ.84 కోట్ల గ్రాస్ సాధించగా, ఇప్పుడు కూలీ ఆ రికార్డును బద్దలు కొడుతుందా అనే ఆసక్తి నెలకొంది.
కేజీఎఫ్ 2 (145Cr), అవతార్ 2 (100Cr), 2.0 (93Cr) లాంటి సినిమాలు టాప్‌లో ఉండగా, కూలీ కనీసం టాప్-5లో చేరాలంటే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అవసరం. యాక్షన్, మాస్ అంశాల పుష్తో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలంటే కంటెంట్ కీలకం.
నాగార్జున, శ్రుతిహాసన్, అనిరుధ్ మ్యూజిక్ వంటి ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం తెలుగులో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా చూడాలి.