
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల కమ్‌బ్యాక్ మూవీగా వస్తున్న ‘భైరవం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 30న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఒక ట్రోలింగ్ వివాదం దీనిపై నీడ వేసింది.
డైరెక్టర్ విజయ్ కనకమేడల 2011లో చిరంజీవి, చరణ్ ఫోటో మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. దీనిపై సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ ఊపందుకుంది. దీనికి స్పందిస్తూ దర్శకుడు ఒక లేఖ ద్వారా క్షమాపణ తెలిపారు.
“ఇది నా పేజీలో కనిపించినా, నేను స్వయంగా పెట్టలేదని అనిపిస్తోంది. అయినా బాధ్యత తీసుకుంటున్నాను” అంటూ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. తాను మెగా కుటుంబానికే సంబంధించినవాడినని చెప్పారు.
ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు. మెగా అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. ఈ వివరణతో వివాదం ఓ క్లారిటీకి వచ్చింది.
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ రెస్పాన్స్‌తోపాటు, సినిమా హైప్ మరలా సాధారణ స్థాయికి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
