
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టిగానే హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి దేశాలు అమెరికా వ్యతిరేకంగా వ్యవహరిస్తే, 10 శాతం అదనపు సుంకాలు విధిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత ప్రధాని సహా బ్రిక్స్ దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా టారిఫ్ విధానంపై పరోక్ష వ్యాఖ్యలు వచ్చాయి. దీనికి ట్రంప్ ఘాటుగా స్పందించారు. చైనా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “సుంకాల యుద్ధంలో ఎవరూ గెలవరు. మేము ఘర్షణను కోరుకోవడం లేదు” అని వ్యాఖ్యానించింది. వాణిజ్యంలో రక్షణాత్మక వైఖరి సరైంది కాదని స్పష్టం చేసింది.
ఇంతకముందు ట్రంప్, బ్రిక్స్ దేశాలు డాలర్‌ను పక్కనబెట్టాలని చూస్తే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. “వాళ్లు మళ్లీ నా దగ్గరకే వస్తారు” అని ధీమాగా వ్యాఖ్యానించారు.
ఇటీవల బ్రిక్స్‌లో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు చేరారు. ఇది అమెరికా వ్యూహానికి సవాలుగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.