
న్యూస్ డెస్క్: ఐదేళ్ల క్రితం వరకు షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ మన దేశంలో టాప్ ట్రెండ్ లో ఉండేది. కానీ గాల్వాన్ ఘటన తర్వాత కేంద్రం నిషేధం వేసింది. అప్పటి నుంచి యాప్ మళ్లీ రీ ఎంట్రీ చేయలేకపోయింది.
ఇక అమెరికాలో కూడా ఇదే సమస్య. బైట్ డ్యాన్స్ చైనా సంస్థ కావడంతో డేటా భద్రతపై సందేహాలు వచ్చాయి. దీంతో అమెరికన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.
ఇప్పుడు ఒరాకిల్ యాప్ ను సొంతం చేసుకోవడంతో అమెరికాలో వివాదం ముగిసింది. అల్గారిథమ్, డేటా మొత్తం ఒరాకిల్ ఆధీనంలోకి వెళ్లనుంది.
ఇక అమెరికా వినియోగదారులకు డేటా భద్రత గ్యారంటీ లభిస్తుందని విశ్వాసం కలిగింది. డీల్ లో సిల్వర్ లేక్ కూడా భాగస్వామిగా ఉంది.
అయితే భారత్ పరిస్థితి వేరు. చైనా సంబంధాలపై ఇంకా ఉద్రిక్తతలు ఉన్నందున రీ ఎంట్రీ అంత ఈజీ కాదు.
మార్కెట్ పరంగా టిక్ టాక్ కు ఇండియా పెద్ద అవకాశమే అయినా, ప్రభుత్వ ఆమోదం కోసం ఇంకా వేచి చూడాల్సిందే.
