
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస రావు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ ఓటరు జాబితాల్లో లోపాలను సరిచేయాలని కోరారు.
ఆధార్ ఒక్కటే కాదు, 11 రకాల గుర్తింపు పత్రాలను అంగీకరించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించారు. ఆధునిక సాంకేతికతతో డూప్లికేట్ ఓట్లను తొలగించాలని సూచించారు.
ఓటర్లకు ప్రత్యేక డోర్ నంబర్ ఇవ్వడం ద్వారా డేటా దొంగతనాన్ని నిరోధించవచ్చని పేర్కొన్నారు. ఫీల్డ్ లెవెల్ అధికారుల నియామకంలో పారదర్శకత అవసరమన్నారు.
1995 సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, పౌరసత్వ నిర్ధారణ ఎన్నికల సంఘం పరిధిలో లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేని వారి ఓటు హక్కు రద్దు చేయరాదని చెప్పారు.
వాట్సాప్ హెల్ప్‌లైన్లు, వార్డు స్థాయి సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన విధానాలు ఉండాలని సూచించారు. బీఎల్వోల ప్రోత్సాహకాన్ని పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, శబరి, కూన రవికుమార్, జ్యోత్స్న పాల్గొన్నారు.