
సూర్య-పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన “రెట్రో” సినిమాపై భారీ అంచనాలు ఉండగా, థియేటర్లలో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. తమిళనాట మాత్రం ఓ మాదిరి ఆదరణ లభించింది.
అయితే ఈ సినిమా ఓటీటీలో మాత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన “రెట్రో” ఒక్క వారం లోపే 4.2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది సూర్యకు ఓ రకంగా డిజిటల్ కం బ్యాక్ అని చెప్పవచ్చు.
వింటేజ్ బ్యాక్‌డ్రాప్, మ్యూజిక్ ఎలిమెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఓటీటీ ఆడియెన్స్‌కి బాగా నచ్చినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూత్, మ్యూజిక్ ప్రేమికులు దీనిపై మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్య నటనతో పాటు పూజా హెగ్డే గ్లామర్ షోనూ ప్రేక్షకులు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.
రెండు భారీ సంస్థలు 2D సినిమాస్, స్టోన్ బెంచ్ కలిసి నిర్మించిన ఈ మూవీ ఓటీటీలో పెద్ద విజయం సాధించడంతో, మేకర్స్‌కు ఊపిరి పీల్చే అవకాశం లభించింది.
surya retro movie ott, netflix retro views, pooja hegde surya film, karthik subbaraj direction, retro tamil movie success,