
ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే?
న్యూస్ డెస్క్: కర్ణాటకలోని ముడా భూముల అక్రమ కేటాయింపుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కీలక నేతలపై ఈడీ విచారణ చేపట్టగా, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
సుద్దగా ఈ కేసు రాజకీయ పోరాటమేనంటూ స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగానికి ఉదాహరణ ఇదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే, ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోవడంపై అయిష్టత వ్యక్తం చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, మంత్రి సురేశ్ లకు జారీ చేసిన ఈడీ సమన్లను హైకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపైే ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
అయితే సుప్రీం ధర్మాసనం ఈడీ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ కేసును పూర్తిగా తిరస్కరించింది. ఇదంతా రాజకీయ దాడుల కోణంలో ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది.
ఈ తీర్పుతో కర్ణాటక ప్రభుత్వం తాత్కాలిక ఊరట పొందగా, ఈడీకి ఇది పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యవహారాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయమూర్తుల వ్యాఖ్యల ద్వారా సంకేతం ఇచ్చినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.