Friday, April 17, 2026
HomeAndhra Pradeshహిందూపురంలో జగన్ షాక్ నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్

హిందూపురంలో జగన్ షాక్ నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్

jagan-suspends-hindupur-leaders

న్యూస్ డెస్క్: హిందూపురంలో వైసీపీకి కీలకంగా ఉన్న ఇద్దరు నేతలపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రవర్తనల నేపథ్యంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

వీరిద్దరూ హిందూపురం వైసీపీలో ప్రారంభం నుంచి సుదీర్ఘకాలంగా పనిచేస్తూ, పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. 2014లో బాలకృష్ణపై నవీన్ పోటీ చేయగా, 2024లో దీపిక పోటీ చేశారు. అయితే తాజా పరిణామాలతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

నవీన్ నిశ్చల్ ఒక కార్యక్రమంలో 2029లో తానే హిందూపురం నుంచి టికెట్ పొందతానని బహిరంగంగా ప్రకటించారు. దీనిపై ఇన్ఛార్జ్ దీపిక తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీ పరువు దెబ్బతిన్నదని ఆమె ఆరోపించారు.

దీంతో పార్టీ హైకమాండ్‌ చర్యకు దిగింది. వ్యక్తిగత అజెండాలకు పని చేసే నేతలను సమర్ధించబోమని సంకేతం ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు ఈ నిర్ణయం తెలిపింది.

వైసీపీలో హిందూపురం పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తదుపరి నేతల ఎంపికపై చర్చలు మొదలయ్యే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular