న్యూస్ డెస్క్: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ సౌతాఫ్రికాతో తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సౌతాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇప్పుడు టీమిండియా ముందు 271 పరుగుల లక్ష్యం నిలిచింది.
సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 89 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా 48 పరుగులు సాధించాడు.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ చెరో 4 వికెట్లు పడగొట్టి సఫారీ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు.
డి కాక్ సెంచరీ చేసినా, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడంతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా ఎలా ఛేదిస్తుందో చూడాలి.
