fbpx
Thursday, June 19, 2025
HomeSportsశుభ్‌మన్ గిల్‌ పై గ్యారీ కిర్‌స్టన్ కామెంట్స్.. టెస్టులో అసలైన పరీక్ష!

శుభ్‌మన్ గిల్‌ పై గ్యారీ కిర్‌స్టన్ కామెంట్స్.. టెస్టులో అసలైన పరీక్ష!

shubman-gill-test-captaincy-gary-kirsten-comments

టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకిన తర్వాత, భారత బ్యాటింగ్, నాయకత్వ భాద్యతలు గిల్ భుజాలపై పడ్డాయి.

జూన్ 20న లీడ్స్ హెడింగ్లే వేదికగా ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో గిల్ కెప్టెన్‌గా అగ్నిపరిశకు సిద్ధమవుతున్నాడు. ఇదే సందర్భంగా కిర్‌స్టన్ మాట్లాడుతూ, గిల్‌లో ఉన్న తెలివితేటలు, నిబద్ధత, అద్భుతమైన ఆటతీరును కొనియాడారు.

“గిల్‌ చెప్పింది చేసే వ్యక్తి, శిక్షణ విషయంలో క్రమశిక్షణతో ఉంటాడు. అతని నాయకత్వ లక్షణాలు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు పెద్ద ఆస్తిగా నిలవవచ్చు” అని కిర్‌స్టన్ అభిప్రాయపడ్డారు.

గిల్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో మూడు టెస్టులు మాత్రమే ఆడినా, అక్కడ మంచి ప్రదర్శన చూపించలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌తో తన ప్రతిభను రుజువు చేసే అవకాశం అతనికి లభించింది.

ఈ టెస్టు సిరీస్ గిల్ కెప్టెన్సీని పరీక్షించడమే కాకుండా, అతని బ్యాటింగ్‌ను తిరిగి నిలబెట్టే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular