Friday, June 27, 2025
HomeMovie Newsరష్మిక మందన్నా "మైసా"లో వైల్డ్ లుక్‌తో సంచలనం

రష్మిక మందన్నా “మైసా”లో వైల్డ్ లుక్‌తో సంచలనం

rashmika-mandanna-maisaa-first-look-gond-tribe-role

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నా మరో భిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త చిత్రం పేరే “మైసా”. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రవీంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రష్మిక గోండ్ తెగ మహిళ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయుధంతో ఉన్న ఆమె వైల్డ్ లుక్ కొత్త యాంగిల్‌ను చూపించి ఆసక్తి రేపుతోంది. “హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్” అనే ట్యాగ్ లైన్ సినిమాకు విభిన్నతను చాటుతోంది.

ఈ పోస్టర్‌ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ స్టార్ సెలెబ్రిటీల చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఇందులో హను రాఘవపూడి, ధనుష్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్ ఉన్నారు.

దర్శకుడు రవీంద్ర మాట్లాడుతూ, “ఈ కథను రెండు సంవత్సరాలుగా నెమ్మదిగా మెరుగుపరుస్తూ రూపొందించాం. ఇప్పుడు ప్రపంచానికి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.

నిర్మాతలు అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, సహ నిర్మాత సాయి గోపా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గోండ్ తెగల నేపథ్యంతో రూపొందే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. రష్మిక నటన, వైల్డ్ లుక్ ఈ సినిమాకు కీలకంగా నిలవనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో టీజర్, సాంకేతిక బృంద వివరాలు ప్రకటించనున్నారు.

rashmika mandanna, maisaa movie, ravindra pulle, tribal action thriller, first look poster,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular