రామ్ చరణ్ కెరీర్‌లోని గుర్తుండిపోయే సినిమా రంగస్థలం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈసారి రంగస్థలం థియేటర్లలో కాకుండా హిందీ బుల్లితెరపై సందడి చేయనుంది. గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్‌లో ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు.
ఉత్తరాదిన రామ్ చరణ్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో రంగస్థలం హిందీ వర్షన్‌కి మంచి స్పందన రావొచ్చని టాక్ నడుస్తోంది. ప్రత్యేకంగా, మెగా ఫ్యాన్స్ ఈ టీవీ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్నారు.
సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథ, పాటలు, పర్ఫార్మెన్స్ అన్నీ కలసి రంగస్థలాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
హిందీ ప్రేక్షకులు రంగస్థలాన్ని ఎంతగా ఆదరిస్తారో చూడాలి.