
బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ, హృతిక్ రోషన్‌తో కాంబినేషన్.. ‘వార్ 2’ సినిమాకి ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆడియెన్స్‌లో బోలెడన్ని అంచనాలు ఉన్నాయి.
హృతిక్, ఎన్టీఆర్ కాస్టింగ్ విషయంలో మొదట్లో అనేక ప్రశ్నలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ స్ట్రాటజిక్ డెసిషన్‌తో బాలీవుడ్ స్టేజ్‌పై దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ కాగా, హృతిక్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారని టాక్.
తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ. 80 కోట్లకు అమ్ముకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పటికే ప్రాజెక్ట్‌పై రూ. 20 కోట్ల లాభాన్ని చూసేసింది. అమెరికాలో కూడా ఎన్టీఆర్ పాప్యులారిటీతో అదనపు వసూళ్లు రావొచ్చని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.
మల్టీస్టారర్‌గా విడుదలవుతున్న ఈ మూవీ తెలుగు మార్కెట్‌లో ఇదే స్థాయిలో బిజినెస్ చేయడం కొత్తగా మారింది. పాన్ ఇండియా స్టార్డ్‌మ్‌తో పాటు కమర్షియల్ పరంగా కూడా ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు.
ఇక అసలు సినిమాకి ఎంత సక్సెస్ వస్తుందనేది విడుదల తర్వాత తెలుస్తుంది.
