fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsరామ రామ సాంగ్ వైరల్! విశ్వంభర హైప్ మళ్లీ పెరిగింది

రామ రామ సాంగ్ వైరల్! విశ్వంభర హైప్ మళ్లీ పెరిగింది

ramarama-song-viswambhara-25million-views-record

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఫాంటసీ ఎపిక్ విశ్వంభర నుంచి వచ్చిన తొలి పాట ‘రామ రామ’ ఇప్పుడు సెన్సేషనల్ హిట్‌గా మారింది. మొదట ఎలాంటి హైప్ లేకుండానే వచ్చిన ఈ పాట, సోషల్ మీడియాలో ఇప్పుడు హవా కొనసాగిస్తోంది.

యూట్యూబ్‌లో 25 మిలియన్ వ్యూస్‌ దాటిన ఈ పాట, మెగా అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. చిరు తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా భక్తి భావంతో కనిపించడమే ఈ పాట స్పెషాలిటీ. కీరవాణి సంగీతం, శంకర్ మహదేవన్ ఆలాపనలు పాటను ఒక దివ్య అనుభూతిగా మార్చేశాయి.

పాటలో చిరంజీవి స్టెప్పులు, ఆయన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ మ్యూజిక్‌తో కలిపి గూస్‌బంప్స్ కలిగించేలా ఉన్నాయి. ఈ పాట సినిమాపై కొత్త అంచనాలు నెలకొల్పింది. ఇది ఎలాంటి మైథలాజికల్ ట్రిట్ ఇవ్వబోతుందో అనే చర్చ ఇప్పుడు ఫ్యాన్స్‌లో మొదలైంది.

మేకర్స్ త్వరలో రెండో సింగిల్, ట్రైలర్ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సాంగ్ సక్సెస్‌ సినిమాకు మునుపటి బజ్‌ను రెట్టింపు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular