fbpx
Friday, June 20, 2025
HomeMovie News'సినిమా బండి': న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్

‘సినిమా బండి’: న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్

RajandDK CinimaBandi TrailerReleased

టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా కథలు, కథనాలు మారిపోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు , సిరీస్ లు తీస్తూ సూపర్ సక్సెస్ లు సాధిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు కొత్తగా వస్తున్న యంగ్ స్టార్స్. ఒకప్పుడు కామెడీ అంటే సినిమా మధ్యలో బాడీ షేమింగ్ చేస్తూ లేక కామెడీ కోసం ఒక ప్రత్యేక ట్రాక్ పెట్టి ఎదో ఆలా నడిపించేవారు. ఇపుడు కొత్త వాళ్ళ రాకతో ఆ పరిస్థితి మారింది. నేటివిటీ టచ్ తో ప్రస్తుతం రియాలిటీ కి దగ్గరా ఉండే సీన్స్ తో మంచి హ్యూమర్ జెనెరేట్ చేస్తూ సినిమాలని హిట్ చేస్తున్నారు న్యూ ఏజ్ మేకర్స్. పెళ్లి చూపులు లాంటి సినిమాలు ఇందుకు నిదర్శనం.

తెలుగు వాళ్ళే అయినా బాలీవుడ్ లో తమ పని తనం చూపించి మంచి సక్సెస్ సాధించారు రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డి.కే ద్వయం (రాజ్ & డి.కే). ఫామిలీ మాన్ సిరీస్ తో ఓటీటీ లో అడుగుపెట్టిన వీళ్ల్లు ఒక తెలుగు సినిమాని ఓటీటీ కోసం రూపొందించారు. వీళ్ళ నిర్మాణంలో ‘సినిమా బండి’ అనే ఒక కామెడీ ఎంటర్టైనర్ రూపొందింది. దీనికి సంబందించిన ట్రైలర్ ఈరోజు విదురాలైంది.

ఒక ఆటో డ్రైవర్ కి తన ఆటో లో ఎవరో వొదిలి వెళ్లిన ఒక సినిమాటిక్ కెమెరా దొరుకుతుంది. దాన్ని పట్టుకుని లోకల్ కెమెరా మాన్ తో సినిమా తీయడానికి పూనుకుంటాడు. ఆ సినిమా కోసం వూర్లో హీరోని, హీరోయిన్ ని, రైటర్ ని వెతకడం , సినిమా పిక్చరైజెశన్ చేయడం, దానికోసం వాళ్ళు పడిన కుస్తీలో కామెడీ ని చూపిస్తూ ఆకట్టుకున్నారు. ప్రతీ ఒక్కరు ఫిలిం మేకర్ ఎట్ హార్ట్ అనే కాప్షన్ జోడించి ఈ ట్రైలర్ ని ముగించారు. ట్రైలర్ లో పల్లెటూర్లో ఎద్దులబండి ని యూస్ చేసి చేసే క్రేన్ షాట్స్ లాంటివి తీయడం చూపించి ఆకట్టుకున్నారు. అందరూ కొత్త నటీనటులతో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా గా ఈ సినిమా రూపొందుతుంది. ప్రవీణ్ కాండ్రేగుల అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందించారు. మే 14 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.

Cinema Bandi | Official Trailer | Telugu Film | Raj & DK | Praveen Kandregula | Netflix India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular