
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముందుగా మే మధ్యలో టీజర్ విడుదల అవుతుందని ఊహించగా, తాజా సమాచారం ప్రకారం అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ.. “మారుతీతో ఇటీవల మాట్లాడాను. ప్రస్తుతం టీజర్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. రానున్న రెండు వారాల్లో తప్పకుండా టీజర్ విడుదల చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ క్లారిటీతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం వెల్లివిరిసింది. మారుతీ మార్క్ కామెడీ, ప్రభాస్ మాస్ లుక్ మిక్స్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనుందని ట్రేడ్ టాక్.
త్రిష, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథా శైలితో వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ తుదిదశకు చేరుకుంటుండగా, టీజర్ విడుదల తర్వాత విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు.
prabhas, raja saab, maruthi, skn, teaser update,