Monday, October 5, 2026
HomeAndhra Pradeshపులివెందుల: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో ఉద్రిక్తత

పులివెందుల: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో ఉద్రిక్తత

pulivendula-tension-mp-avinash-reddy-arrested-before-zptc-bypoll

న్యూస్ డెస్క్: కడప జిల్లాలోని పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామునే పులివెందుల పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. ఎంపీ ఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అరెస్టు సమయంలో ఎంపీ, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అవినాష్ రెడ్డితో పాటు వైసీపీకి చెందిన మరికొందరు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలపై కూడా చర్యలు తీసుకున్నారు. పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డి గృహనిర్బంధంలోకి వెళ్లారు.

పోలీసులు ఈ చర్యలను శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎన్నికలు సజావుగా సాగేందుకు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే, రాజకీయ నేతలు మాత్రం ఈ అరెస్టులు ఉద్దేశపూర్వకమని ఆరోపిస్తున్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో మరికొందరిని బైండోవర్ కూడా చేశారు. ఎన్నికల రోజున ఏవైనా ఘర్షణలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ పరిణామాలతో ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. రెండు పార్టీల మధ్య వాగ్వాదాలు, ఆరోపణలు కొనసాగుతుండటంతో పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular