
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ పెద్దిపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే చరణ్ ఊర మాస్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
అయితే, ఇప్పుడు మరో క్రేజీ లుక్ కూడా సిద్ధంగా ఉందని మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ కోసం కొత్త మేకోవర్‌ను ప్లాన్ చేస్తూ, పవర్ ప్యాక్డ్ లుక్స్‌ను రెడీ చేశామని టీమ్ తెలిపింది. ఈ లుక్ కోసం ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ ప్రత్యేకంగా పనిచేశాడు.
ఈ లుక్ ట్రయల్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. రామ్ చరణ్ ఒకేసారి రెండు విభిన్న లుక్స్‌లో కనిపించడం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
దర్శకుడు బుచ్చిబాబు, కథకు తగ్గట్టుగా చరణ్ లుక్‌ను రాకింగ్‌గా ఫైనల్ చేస్తున్నట్టు తెలిపారు. మాస్, క్లాస్ ఆడియన్స్ రెండింటినీ ఆకట్టుకునేలా మేకోవర్ ఉండబోతోందని సమాచారం.
ఇక జాన్వీ కపూర్‌తో రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందోనన్న ఉత్కంఠ కూడా పెరిగింది. మొత్తానికి పెద్ది చుట్టూ హంగామా రోజురోజుకి రెట్టింపవుతోంది.