
స్పోర్ట్స్ డెస్క్: CSK vs PBKS: ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించింది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నైకు ఇది మూడో వరుస ఓటమి కాగా, ప్లే ఆఫ్స్ రేసులో నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌట్ అయింది. సామ్ కరన్ (88), బ్రెవిస్ (32) మాత్రమే ప్రభావితం చేశారు. చాహల్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించి మ్యాచ్‌కు మలుపు తిప్పాడు.
లక్ష్యచేదనలో పంజాబ్, శ్రేయస్ అయ్యర్ (72), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) అర్ధశతకాలతో దూకుడుగా ఆడి 19.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలింగ్‌లో పతిరన, ఖలీల్ తలో రెండు వికెట్లు తీశారు.
చెన్నైకు చెపాక్‌లో ఇది ఐదో వరుస ఓటమి కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు హోం మైదానంలో ఇంతటి పరాజయాల పరంపర ఇదే తొలిసారి.
ఈ విజయంతో పంజాబ్ 13 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా, చెన్నై 10 మ్యాచ్‌ల్లో ఎనిమిదో ఓటమి నమోదు చేసుకుంది.