Monday, October 5, 2026
HomeAndhra Pradeshజడ్జిపై ఎంపీల తీరుకు పవన్ ఆగ్రహం!

జడ్జిపై ఎంపీల తీరుకు పవన్ ఆగ్రహం!

pawan-kalyan-serious-on-india-bloc-mps-impeachment-move

న్యూస్ డెస్క్: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానానికి ప్రతిపక్ష ఎంపీలు ప్రయత్నించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ ధర్మానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను భయపెట్టేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

తమిళనాడులోని ఒక ఆలయ దీపస్తంభం వివాదంలో కోర్టు హిందూ ఆచారాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ కు లేఖ ఇవ్వడం రాజకీయంగా ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం హిందూ ఆచారాలను కాపాడేలా తీర్పు ఇచ్చినంత మాత్రాన, ఏకంగా జడ్జిని తొలగించమనడం ఎంతవరకు సమంజసమని పవన్ ప్రశ్నించారు. ఇది న్యాయవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నమని ఆయన ఘాటుగా విమర్శించారు.

గతంలో శబరిమల విషయంలో సంప్రదాయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు ఎవరూ జడ్జీలను తప్పుపట్టలేదని పవన్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు హిందువులకు అనుకూలంగా తీర్పు రాగానే ఇలా రియాక్ట్ అవ్వడం విపక్షాల సూడో సెక్యులరిజానికి నిదర్శనమని అన్నారు.

ఒక వర్గం విశ్వాసాలను కాపాడినప్పుడు ఓర్వలేక ఇలాంటి దాడులకు దిగడం దారుణమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయమూర్తులు స్వేచ్ఛగా తీర్పులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ధర్మాన్ని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular