Saturday, October 3, 2026
HomeNationalహెచ్-1బీ వీసాదారులకు షాక్.. అపాయింట్మెంట్స్ వాయిదా!

హెచ్-1బీ వీసాదారులకు షాక్.. అపాయింట్మెంట్స్ వాయిదా!

h-1b-visa-appointments-postponed-for-indians-due-to-social-media-check

న్యూస్ డెస్క్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారి అపాయింట్మెంట్స్ అకస్మాత్తుగా వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా విదేశాంగ శాఖ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా నిబంధనలే అని తెలుస్తోంది.

భద్రతా కారణాల దృష్ట్యా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అమెరికా నిర్ణయించింది. ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ కోసం చాలా మంది ఇంటర్వ్యూలను రద్దు చేసి, వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు అక్కడి రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

ఇప్పటికే ఎవరికైతే అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయినట్లు మెయిల్ వచ్చిందో, వారు పాత తేదీల్లో కాన్సులేట్ కు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. కొత్త తేదీలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే తప్ప, నేరుగా వెళ్తే అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త స్క్రీనింగ్ మొదలవుతోంది. హెచ్-1బీ దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను ‘పబ్లిక్’ మోడ్ లో ఉంచాలని, ప్రైవసీ లాక్ లు తీసేయాలని ఆదేశించారు. దేశ భద్రతకు ముప్పు ఉందా లేదా అని ఆన్ లైన్ లో చెక్ చేశాకే వీసా మంజూరు చేస్తారట.

ఇప్పటికే ట్రంప్ సర్కార్ హెచ్-1బీ వీసాలపై భారీగా ఫీజులు పెంచడంతో భారతీయులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా నిఘా కూడా తోడవడంతో అమెరికా కల మరింత భారంగా, కష్టంగా మారుతోందని నిపుణులు అంటున్నారు.

ఈ కొత్త నిబంధనల వల్ల వీసా ప్రాసెస్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రాబోయే వారాల్లో మరిన్ని అపాయింట్మెంట్స్ రద్దయ్యే ఛాన్స్ ఉందని, మార్చి వరకు ఈ వాయిదాల పర్వం కొనసాగవచ్చని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular