
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ హరీష్ కాంబోలో వస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఈ సినిమాను బాక్సాఫీస్ హిట్‌గా ఊహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే, ప్రమోషన్స్ విషయంలో మాత్రం నిర్మాతలు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పవన్ నటించిన “ఓజి” సినిమా విడుదలైన తర్వాతే “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
అందుకే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ ఇవ్వలేదు. “ఓజి” తర్వాతే ఈ సినిమా టీమ్ ప్రణాళికబద్ధంగా ప్రమోషన్స్ జరపనుంది. ఫ్యాన్స్ మాత్రం ఓపికగా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను 2025 అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ప్రమోషనల్ యాక్టివిటీస్‌కు మంచి స్టార్ట్ లభించనుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.