
టాలీవుడ్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఒక్కో అప్డేట్‌తో మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఊపేసింది.
తాజాగా ఈ సినిమాలో పవన్ కుమారుడు అకీరానందన్ కనిపించనున్నాడనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. పాటలోని కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అకిరాకే సరిపోతున్నాయని అభిమానులు చర్చిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అకిరా క్యామియోపై కొత్త వాదనలు ఊపందుకున్నాయి.
గతంలో ఈ సినిమాతో పని చేసిన ఒక నటుడు పవన్ పాత్రకు మూడు విభిన్న దశలు ఉన్నాయని రివీల్ చేశారు. వాటిలో యంగ్ స్టేజ్ పాత్రలో అకిరా వస్తే అది థియేటర్లలో బ్లాక్‌బస్టర్ మూమెంట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. మెగా వారసుడి కోసం ఇంత గ్రాండ్ డెబ్యూ ఇంకోటి ఉండదని కూడా కామెంట్లు చేస్తున్నారు.
అయితే, అధికారికంగా యూనిట్ నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. కొంతమంది ఈ వార్తలను కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజం అవుతుందని నమ్ముతున్నారు.
ఏదేమైనా, అకిరా నిజంగా ఓజిలో కనిపిస్తే, సినిమా హైప్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఈ వార్తలో నిజం ఉందో లేదో త్వరలోనే తేలనుంది.