Thursday, June 26, 2025
HomeMovie Newsఎన్టీఆర్ ‘వార్-2’.. ప్రమోషన్స్ లో ఈ ఆలస్యమేంటి?

ఎన్టీఆర్ ‘వార్-2’.. ప్రమోషన్స్ లో ఈ ఆలస్యమేంటి?

ntr-war2-promotion-delay-concern

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న “వార్-2” సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది.

ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఇంకా కొన్ని సీన్స్ షూట్ చెయ్యాల్సి ఉందట. ముఖ్యంగా హృతిక్-తారక్ కాంబినేషన్‌లో ఓ మాస్ సాంగ్‌ను జూలై మొదటి వారంలో ప్లాన్ చేశారు.

ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసినా.. అనుకున్నంత బజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. తెలుగులో హైప్ తక్కువగానే ఉంది అనే అభిప్రాయం వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ఎన్టీఆరే ప్రధాన ఆకర్షణ కావడంతో మేకర్స్ ప్రమోషన్ ప్లాన్ స్పీడ్ చేయాల్సిన అవసరం ఉంది.

దక్షిణాది మార్కెట్‌లో అయాన్ ముఖర్జీకి పెద్దగా రీచ్ లేకపోవడం వల్ల ఎన్టీఆర్ బ్రాండ్ వాల్యూ మీదే సినిమాకి డిపెండెంట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అదే రోజు రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అందుకే నెటిజన్లు “ఇంకెప్పుడు సారూ?” అంటూ మేకర్స్‌ను తడుముకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular