Tuesday, July 22, 2025
HomeMovie Newsరోజుకు 12 గంటలు.. నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

రోజుకు 12 గంటలు.. నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

nani-15-days-dedication-for-paradise-action-scene

న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ప్యారడైజ్ కోసం అసాధారణమైన డెడికేషన్ చూపించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ యాక్షన్ సీన్ కోసం స్పెషల్ సెట్ వేశారు. ఈ సన్నివేశాన్ని 15 రోజులు పాటు చిత్రీకరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాని షూటింగ్‌లో పాల్గొన్నారు. మట్టితో నిండిన ఆ లొకేషన్‌లో ఉండటం కూడా కష్టమే.

ఈ ఫైట్ సీన్‌కి ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్లను తీసుకువచ్చారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా హై స్టాండర్డ్‌కి తగిన విధంగా సీన్‌ను తెరకెక్కించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్‌గా నిలవనుందని టాక్.

నాని అలా 15 రోజులు సెట్లో గడిపి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని యూనిట్ చెబుతోంది. సినిమాపై ఉన్న నమ్మకంతో నాని ఈ స్థాయి కష్టపడడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దసరా వంటి హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్యారడైజ్‌కి కూడా అదే స్థాయిలో హైపును సృష్టించేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular