
న్యూస్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై త్వరితంగా నిర్ణయానికి రావద్దని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్‌బీ) హెచ్చరించింది. కొన్నీ మీడియా కథనాల్లో ప్రమాదానికి ఇంధన స్విచ్‌ల ఆఫ్ అవడం కారణమని పేర్కొనడం నేపథ్యంలో బోర్డు స్పందించింది.
ఈ కథనాలను ‘అపరిపక్వమైన ఊహాగానాలు’గా నిర్ధారిస్తూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, తుది నివేదిక రావడానికి ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చని స్పష్టం చేసింది.
భారత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తో కలిసి ఈ కేసును విచారిస్తున్న ఎన్టీఎస్‌బీ, తుది నిర్ధారణకు ముందు ప్రచారాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ సమయంలో ఇంధన స్విచ్‌లు కటాఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయినట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అదే ప్రమాదానికి దారితీసిన సమీకరణంగా చెబుతోంది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డులో ఉన్న సమాచారాన్ని ప్రాముఖ్యతగా తీసుకుని దర్యాప్తు కొనసాగుతోంది. ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్ అయ్యాయనే అంశంపై స్పష్టత వచ్చేదాకా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగనుంది.
