fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsనాని హిట్ 3 మూవీ రివ్యూ & రేటింగ్

నాని హిట్ 3 మూవీ రివ్యూ & రేటింగ్

nani hit 3 movie telugu review

కథ: హిట్ 3: దేశవ్యాప్తంగా ఒకే ప్యాట్రన్‌లో జరిగే 12 హత్యలు. ఈ కేసు విచారణలో నాని పోషించిన అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సినిమా సాగుతుంది. విచారిస్తున్న హత్యలతో కథ కొత్త కోణం పడుతుంది. ఇక ఆ కిల్లర్ ఎవరు అనే పాయింట్ లో అడలు కథ సాగుతుంది. ఇక ‘హిట్’ ఫ్రాంచైజీలో ఇది మూడో భాగం అయినా, ఇది పూర్తి మాస్ టేక్ గా తెరకెక్కింది.

విశ్లేషణ:

దర్శకుడు శైలేష్ కొలను ఈసారి ఇన్వెస్టిగేషన్ కంటే యాక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. నాని తన ఫ్యాన్స్‌కి కావల్సిన మాస్ మసాలాను అందించాడు. కథ మధ్యలో కొంత ఊపు కోల్పోయినప్పటికీ, క్లైమాక్స్ ఫైట్‌తో తిరిగి పట్టుకుంది. నానిలోని మాస్ యాంగిల్ ఈ సినిమాతో మరోసారి బయటపడింది. మాస్ డైలాగులు, హింసాత్మక సీన్లు యువతను ఆకట్టుకుంటాయి.

‘హిట్ 3’లో దర్శకుడు శైలేష్ కొలను తీసుకున్న మెచ్చుకోదగ్గ నిర్ణయం ఏమిటంటే, కథను మానసిక స్థాయికి దగ్గరగా తీసుకెళ్లడం. నానిని సైకో తరహా మైండ్‌స్టేట్‌లో చూపించడంతో, హీరో పాత్రలోని మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగాల కలయిక ఆసక్తికరంగా నడుస్తుంది. కథా నిర్మాణంలో కొన్ని చోట్ల తడబాట్లు ఉన్నా, అర్జున్ సర్కార్ పాత్ర విస్తృతంగా ఆవిష్కృతమైంది. నాని క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో, కథ వెనక ఉన్న భావోద్వేగాలకు ప్రేక్షకుడి కనెక్షన్ ఏర్పడుతుంది.

ఇక డార్క్ టోన్, థ్రిల్లింగ్ నేపథ్యం సినిమా మొత్తాన్ని ఒక పవర్ఫుల్ మూడ్‌లో ఉంచుతుంది. పాటలు లేకపోవడం, లవ్ ట్రాక్‌ను హద్దులలో ఉంచడం మంచి నిర్ణయం. యాక్షన్ ఎపిసోడ్‌లు ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే వరుస ఫైట్ సీన్‌లు, స్క్విడ్ గేమ్ తరహాలో వచ్చిన సెట్‌పీస్‌లు టెక్నికల్‌గా బాగా రూపొందించబడ్డాయి. అయితే స్క్రీన్‌ప్లే కాస్త మెరుగ్గా ఉండి ఉంటే, ఈ చిత్రం మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. అయినా కూడా నాని నటనతో సినిమా ఆద్యంతం చక్కగా నడిచింది.

ప్లస్ పాయింట్స్:

1. నాని రఫ్ అండ్ ఇంటెన్స్ పాత్రలో ఒదిగిపోయాడు

2. స్క్విడ్ గేమ్ తరహాలో డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు

3. క్లైమాక్స్‌లో శేష్ సర్ప్రైజ్

4. శ్రీనిధి శెట్టి ఎఫెక్టివ్ పాత్ర

5. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి

3 మైనస్ పాయింట్స్:

1. స్ట్రాంగ్ విలన్ లేకపోవడం

2. ఇన్వెస్టిగేషన్ పరంగా పట్టలేని స్క్రీన్‌ప్లే

3. కొన్ని డైలాగులు, హింస కుటుంబ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular