
టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన నటనతోనే కాదు, సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ గా మారింది. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నెట్టింట మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా నిలిచింది.
మొదటిగా మరాఠీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృణాల్, బాలీవుడ్లో లవ్ సోనియా, తుఫాన్, ధమాక వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను పెంచుకుంది. టాలీవుడ్లో మాత్రం సీత పాత్రతోనే ఓ విప్లవం సృష్టించింది.
ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ హిట్, ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ అయినా ఆమె పాపులారిటీ మాత్రం పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తున్న ఆమె గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కల్కి 2898ADలో క్యామియో రోల్ చేసిన మృణాల్.. ఆ మూవీలో కూడా మెరిసింది.
మరొకవైపు మృణాల్ ఇన్‌స్టాలో పెట్టే హాట్, స్టైలిష్ ఫొటోలు ఫిదా చేస్తున్నాయి. అందులో ఆమె అందం, క్యాప్షన్ సెలక్షన్ – రెండూ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఆమె పోస్ట్‌లు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి.
ఇలా వెబ్‌లోనే కాదు, వర్క్ ఫ్రంట్‌లోనూ మృణాల్ పాపులారిటీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మోస్ట్ పాపులర్ హీరోయిన్గా నిలిచిన ఆమెకు ఇది మరో ప్రత్యేకమైన గుర్తింపు అని చెప్పొచ్చు.