
మూవీడెస్క్: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రకారం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారని తెలిపింది.
ఆర్మాక్స్ సంస్థ ఈ మోస్ట్ పాపులర్ జాబితాను ఇవాళ విడుదల చేసింది.
ప్రభాస్ తాజ సినిమా కల్కి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని అభిమానుల హృదయాలను గెలిచారని పేర్కొంది.
ప్రభాస్ తరువాతి స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నారని సంస్థ జాబితా ప్రకారం తెలుస్తొంది.
కాగా, ఇదే సంస్థ మే నెలలో విడుదల చేసిన జాబితాలో కూడా ప్రభాస్ అగ్రస్థానంలో ఉండడం టాలివుడ్ కు గర్వ కారణం.
2024 జూన్ నెల జాబితా విడుదల అవగా, ఇందులో అల్లు అర్జున్ కు నాలుగో స్థానం, జూనియర్ ఎన్టీఆర్ కు ఐదో స్థానం లభించాయి.
గేమ్ ఛేంజర్ చిత్రం ద్వారా త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న రామ్ చరణ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు.
ఇక హీరోయిన్ ల అత్యంత పాపులర్ జాబితాలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ తొలి స్థానంలో ఉండగా తరువాత సమంత, దీపిక పడుకొనె రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.