
న్యూస్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనను ఘనంగా ముగించుకున్నారు. ఈ పర్యటనలో ఆయనకు మూడు దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు లభించడం విశేషం.
బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు మోదీకి తమ అత్యున్నత గౌరవాలను అందజేశాయి. ప్రధాని హోదాలో ఇదే అతిపెద్ద గుర్తింపుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఒక్క పర్యటనతో మోదీకి విదేశీ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 27కి చేరింది. 2014 నుంచి ప్రధాని హోదాలో ఉన్న ఆయనకు ఎన్నో గౌరవాలు లభించాయి.
ఈ పర్యటనలో మోదీ ఘనా, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ దేశాలను సందర్శించారు. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక బంధాలను పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యం.
బ్రెజిల్‌లో బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న మోదీ, ఆర్థిక సహకారం, అభివృద్ధిపై చర్చలు జరిపారు. అర్జెంటీనాతో వ్యాపార ఒప్పందాలు, ఘనాతో విద్యా భాగస్వామ్యం జరగాయి.
ఈ పర్యటనలో మోదీ నాయకత్వం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశానికి పరిపూర్ణ గౌరవాన్ని తీసుకొచ్చారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.