న్యూస్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు అలియాస్ నాని గురువారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఓ కేసులో కోర్టు విధించిన షరతుల మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు.
గతంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై జరిగిన దాడికి సంబంధించి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్‌కు ముందు జామీను పొందేందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టులో దరఖాస్తు చేయాలని సూచించడంతో గుడివాడ కోర్టుకు వెళ్లారు.
అక్కడ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా, ఆ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌కి హాజరుకావాల్సి వచ్చింది. ఇందుకుగాను ఈరోజు నాని స్టేషన్లో సంతకం చేశారు.
ఈ సందర్భంగా నాని స్టేషన్ వద్ద పెద్దగా మాట్లాడకుండా మౌనంగా బయటకు వచ్చారు. అధికారికంగా పోలీసులు కూడా ఆయనపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై స్పష్టత ఇచ్చారు.
అరెస్ట్ అయ్యారంటూ గతంలో వచ్చిన వార్తలను పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో నాని కోర్టు ఆదేశాలను పాటిస్తున్నట్లు స్పష్టమైంది.
