
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా టాప్ ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్లతో భారీ వసూళ్లు అందుకున్న ఆయన తాజా సినిమా కూలీపై హైప్ ఎక్కువగా ఉంది.
ఈ సినిమాతో రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో లోకేష్ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయింది. కూలీ సినిమా కోసం తాను రూ.50 కోట్లు తీసుకున్నట్లు ఆయన తానే స్వయంగా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తన గత చిత్రం లియో 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని చెప్పారు. అలాగే కూలీ కోసం రెండేళ్లు సమయం కేటాయించినందున ఆ రెమ్యునరేషన్ తనకు న్యాయమని చెప్పుకున్నారు.
తన గత హిట్స్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు. సాధారణంగా దర్శకులు రెమ్యునరేషన్ విషయంలో మాట్లాడరని, కానీ తాను ఓపెనుగా చెప్పడం నచ్చకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
కూలీ సినిమా ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.