
భాషల్ని దాటి ఇండియన్ సినిమా ఇప్పుడు కాంబినేషన్ల పరంగా విప్లవాత్మక మార్పులు చూస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయిక మరింత ఉత్కంఠ రేపుతోంది.
ఈ కాంబోలో ఇప్పటికే కూలీ అనే ప్రాజెక్ట్ ప్రకటించగా, అది అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో రూపొందుతోంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే, లోకేష్ ఒక సూపర్ హీరో జానర్ ప్రాజెక్ట్‌ను అమీర్‌ను హీరోగా పెట్టి డైరెక్ట్ చేయనున్నాడట.
ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సమాచారం. 2026 రెండో అర్ధభాగంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ బజ్. ఇది అమీర్ ఖాన్ రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా బయటపడిన టాక్.
లోకేష్ కనగరాజ్ స్టైల్, మ్యాస్ టేకింగ్‌తో అమీర్ ఖాన్ లాంటి స్టార్ జత అయితే దేశవ్యాప్తంగా భారీ హైప్ గ్యారెంటీ. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరో ఫ్రాంచైజీ అవుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే నెలలో వెలువడే అవకాశముంది.