
లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చినా భారీ విజయాన్ని అందుకుంది. మౌళి తనూజ్, శివాని నాగారం జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లో చూసినవాళ్లు, మిస్ అయినవాళ్లు అందరూ ఈ మూవీనీ ఎంజాయ్ చేయబోతున్నారు.
అయితే ఇక్కడితో సరిపెట్టలేదు. ఓటీటీ వెర్షన్‌లో ఒక సర్ప్రైజ్ కూడా జోడించబోతున్నారట. అదేంటంటే లిటిల్ హార్ట్స్ సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ప్రత్యేక ఎక్స్టెన్షన్ చూపించబోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు డబుల్ హ్యాపీ అయ్యారు.
మూవీ చిన్న బడ్జెట్ తో తెరకెక్కినా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాని ప్రశంసించారు. దీంతో సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి.
లిటిల్ హార్ట్స్ 2లో ఇంకా ఎక్కువ ఎమోషన్, కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సాయి మార్తాండ ఈసారి మరింత పెద్ద కాన్సెప్ట్ తో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడట.
