fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsటాలీవుడ్ బాక్సాఫీస్: జూన్‌లో రాబోతున్న భారీ సినిమాలు

టాలీవుడ్ బాక్సాఫీస్: జూన్‌లో రాబోతున్న భారీ సినిమాలు

june-telugu-movies-release-thuglife-veera-mallu-kuber

2025 సమ్మర్ సీజన్ టాలీవుడ్‌లో నిరాశ మిగిల్చినా.. జూన్ మాత్రం ఆసక్తికర సినిమాలతో సందడిగా మారబోతోంది. షూటింగ్ లేట్స్, గ్రాఫిక్స్ ఆలస్యం వంటి కారణాలతో వాయిదా పడిన భారీ సినిమాల స్థానాన్ని, కంటెంట్ ఉన్న సినిమాలు భర్తీ చేయనున్నాయి. 

థగ్ లైఫ్ నుంచి కన్నప్ప వరకు, విభిన్నమైన కథలు, స్టార్ కాస్టింగ్‌తో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

జూన్ 5న కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. శింబు, త్రిష, పంకజ్ త్రిపాఠిల నటన, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ హైలైట్‌గా నిలవనున్నాయి.

జూన్ 13న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలోకి రానుంది. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ భారీ అంచనాల మధ్య విడుదలకానుంది. క్రిష్-జ్యోతిక్రిష్ణ కాంబో, కీరవాణి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ.

జూన్ 20న రెండు సినిమాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నాయి. ధనుష్-నాగార్జున-రష్మికల ‘కుబేర’, అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’. యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయిన ఈ రెండు సినిమాలు కూడా జూన్ విడుదలల్లో హైలైట్ కానున్నాయి.

జూన్ 27న విడుదల కానున్న ‘కన్నప్ప’ మాత్రం మైథలాజికల్ మూవీ లవర్స్‌కి స్పెషల్ ట్రీట్‌గా మారనుంది. విష్ణు, ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్‌ సమాఖ్యలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్‌కి ప్రత్యేక గుర్తింపు రావొచ్చని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular