
మూవీడెస్క్: జూలై టాలీవుడ్ విడుదలలు. మూడు విభిన్న సినిమాలు, భిన్న జోనర్లలో ఒకేసారి థియేటర్లకు వస్తుండటంతో ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది.
ఈ సినిమాలు అందరికీ విభిన్నమైన అనుభూతిని కలిగించనున్నాయని చెప్పాలి.
జూలై 4న రిలీజ్ కానున్న చిత్రాలలో మొదటిది నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు. అక్క-తమ్ముడు అనుబంధంతో కూడిన కథతో, యాక్షన్ నేపథ్యాన్ని మిళితం చేస్తూ రూపొందిన ఈ సినిమాలో లయ నితిన్ అక్కగా నటించడంతో ఇది ఆమె రీఎంట్రీ కావడం ప్రత్యేక ఆకర్షణ.
అదే రోజున సిద్ధార్థ్ నటించిన 3 BHK చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
శ్రీగణేశ్ డైరెక్షన్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మరో వైపు, హాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్ కూడా అదే రోజున విడుదలవుతుంది. ఇది జురాసిక్ వరల్డ్ డొమినియన్‌కు సీక్వెల్ కావడం విశేషం.
ఈ చిత్రాన్ని గరేత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేస్తుండగా, స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన గ్లోబల్‌గా ఆసక్తి నెలకొంది.
మొత్తానికి జూలై తొలి వారంలో ప్రేక్షకులకు థియేటర్‌లో మూడింతల వినోదం ఖాయం. ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో చూడాలి!