Saturday, June 13, 2026
HomeLife Styleపంచదారకు గుడ్‌బై.. బెల్లం వాడితే ప్రయోజనాలు ఇవే!

పంచదారకు గుడ్‌బై.. బెల్లం వాడితే ప్రయోజనాలు ఇవే!

jaggery-benefits-replacement-for-sugar-health-tips

న్యూస్ డెస్క్: స్వీట్ ప్రియులకు పంచదారతో తయారైన మిఠాయిలు టీ కాఫీల వరకు ఆరోగ్యానికి హానికరం. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వినియోగిస్తే ఎలాంటి హాని చేయకపోగా, అనేక లాభాలు కలుగుతాయి. బెల్లం చేసే మేలు తెలియడం వల్ల పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడటం ఇప్పుడు పెరుగుతోంది.

బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం వంటి విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఆయుర్వేదంలో బెల్లం తాటిబెల్లాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

బెల్లం తింటే రోగనిరోధక శక్తి పెరగడమేకాదు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలను అరికడుతుంది. తగిన మోతాదులో బెల్లాన్ని తీసుకుంటే ఊబకాయాన్ని నిరోధించవచ్చు.

ఎముకలు దంతాలు పటిష్టంగా ఉంటాయి. బెల్లంలో కాస్తంత అల్లం నూరి తీసుకుంటే కీళ్ల నొప్పులు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంతేకాదు ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరటంలాంటి సమస్యల్ని తగ్గించే గుణం బెల్లంలో ఉంది. రక్తాన్ని శుద్ధి చేయడం శరీరంలో చేరిన మలినాల్ని బయటకు పంపేసే గుణం బెల్లం సొంతం. ఇది కాలేయానికి కూడా మేలు చేస్తుంది.

పంచదారకు బదులుగా బెల్లాన్ని తగిన మోతాదులో వాడటంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే బెల్లాన్ని కాఫీ టీల్లో వాడటం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular