
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్‌కి చివరి దశకు చేరుకుంది. చాలా ఏళ్లుగా వాయిదాలు ఎదుర్కొన్న ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా జూలై 24న థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. ఈ నేపథ్యంలో సినిమా రన్ టైమ్ పై కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజా వార్తల ప్రకారం, ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల నిడివితో విడుదల కానుంది.
ముందుగా 2 గంటల 40 నిమిషాలుగా ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని సన్నివేశాల ప్రభావంతో టైమ్ కొద్దిగా పెరిగిందని తెలుస్తోంది. అయితే ఇంకా సెన్సార్ క్లారిటీ రావాల్సి ఉంది.
ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉండనుందని బజ్. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.