పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి హిస్టారికల్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జ్యోతి కృష్ణ మరియు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను మొదట అనౌన్స్ చేసిన సమయంలో అభిమానులలో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ అనేక కారణాలతో సినిమా దాదాపు ఐదేళ్ల ఆలస్యానికి గురైంది. అయినా కూడా ఆశ తగ్గలేదు.
ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందుగా అందరూ ఎదురుచూస్తున్నది ట్రైలర్. ఇందులోనే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో ఉన్నారో చూడాలనుకుంటున్నారు అభిమానులు.
తాజాగా మేకర్స్ ఫైనల్ ట్రైలర్ కట్‌ను లాక్ చేసినట్టు సమాచారం. ఈ వారం చివరిలో లేదా వచ్చే వారం ప్రారంభంలో ట్రైలర్‌ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ట్రైలర్ రిలీజ్‌తో పాటు మళ్లీ హరిహర వీరమల్లు సినిమాపై మాస్ లెవెల్‌లో బజ్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తిగా పవన్ మేనియా రీచార్జ్ చేసే చాన్స్‌గా మారవచ్చు. ఈసారి నిజంగా వీరమల్లు విధ్వంసం ఎలా ఉండబోతోందో చూడాలి.