
న్యూస్ డెస్క్: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గూగుల్ నుంచి భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం పిక్సెల్ 8ఎపై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌ను సగం ధరలో సొంతం చేసుకునే అవకాశం అందిస్తోంది.
అసలు ధర రూ. 52,999 ఉన్న పిక్సెల్ 8ఎ (128GB) మోడల్‌పై రూ. 15,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ధర రూ. 37,999కి తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు EMI ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఫోన్ రూ. 30,999కే లభిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంది.
మీ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 33,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ విలువ మీ పాత ఫోన్ మోడల్, స్థితి ఆధారంగా మారుతుంది. ఈ ఆఫర్‌తో పిక్సెల్ 8ఎ మధ్యతరగతి బడ్జెట్‌లో మంచి డీల్‌గా మారింది.
ఫీచర్ల విషయానికొస్తే, పిక్సెల్ 8ఎలో 6.1 ఇంచుల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వాడారు.
టెన్సర్ G3 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8GB RAM, 128/256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. కెమెరా విభాగంలో 64MP ప్రైమరీ, 13MP అల్ట్రావైడ్ లెన్స్ డ్యూయల్ రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
4,492mAh బ్యాటరీతో, ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు రోజులు పని చేస్తుందని గూగుల్ చెబుతోంది. AI ఫోటోగ్రఫీ టూల్స్‌తో పిక్సెల్ 8ఎ ఫోటో లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
