
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విదేశీ పర్యటనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు హాలిడే ట్రిప్‌కి వెళ్లినట్లుగా కాకుండా, జాతీయ బాధ్యతతో వెళ్లాలని సూచించారు.
తాజా ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరికీ కుటుంబం ముఖ్యం. కానీ దేశం కోసం వెళ్లినప్పుడు దృష్టి పూర్తిగా ఆటపైనే ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆటగాళ్లంతా దేశ గౌరవాన్ని ముందుగా పెట్టుకోవాలని అన్నారు.
డ్రెస్సింగ్‌రూమ్‌లో తక్కువమంది మాత్రమే ఉంటారని, వారితో కలిసి కష్టపడి దేశం గర్వపడేలా ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని తెలిపారు. దేశం తరఫున ఆడటం ఓ గొప్ప గౌరవమని, అందుకు తగిన నిబద్ధత అవసరమన్నారు.
విదేశీ టూర్‌లో కుటుంబానికి సమయం కేటాయించడం తప్పు కాదని, కానీ ప్రాధాన్యం ఆటకే ఉండాలన్నారు. ఆటపై ఫోకస్ పెడితేనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు.
విజయాల వెనుక కుటుంబాల మద్దతు కూడా కీలకమని గుర్తు చేశారు. పుజారాతో జరిగిన ముఖాముఖి చర్చలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.