
న్యూస్ డెస్క్: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరును రాజకీయ వర్గాల్లో గుర్తించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వైసీపీ నాయకుల్లో ముందే ఉండే ద్వారంపూడి, జనసేన టార్గెట్ చేస్తూ మీడియా హాట్ టాపిక్ అయ్యారు. కానీ తాజా రాజకీయ పరిణామాలతో ఆయన ప్రాభవం తగ్గిపోయింది.
ముఖ్యంగా జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి రైస్ వ్యాపారం మీద పెద్ద దెబ్బ పడింది.
కాకినాడ సిటీలో రెండుసార్లు విజయం సాధించినా, ఇప్పుడు రాజకీయంగా కనపడటం లేదు. గతంలో రెండు గోదావరి జిల్లాల్లో, తెలంగాణలోనూ ద్వారంపూడి రైస్ బిజినెస్ పేరు మార్మోగేది. ప్రస్తుతం ఆయన పేరు, ప్రాభవం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వైసీపీకి బలమైన వాయిస్‌లలో ఒకరిగా చెలామణి అయినా, పవన్‌ను టార్గెట్ చేయడం వల్ల ద్వారంపూడికి నెగటివ్ అయ్యింది. నియోజకవర్గంలో అనుచరులు కూడా దూరమవుతున్నారు. వ్యాపారుల్లో విభేదాలు పెరిగాయి.
ఇప్పుడు రాజకీయాల్లో ద్వారంపూడి బ్రేక్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అభిమానులు ఆయన రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలతోపాటు ఆయన పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.