Monday, May 18, 2026
HomeNationalఇండియా కూటమి కుదేలవుతోందా?

ఇండియా కూటమి కుదేలవుతోందా?

india-alliance-cracks-aap-trinamool-boycott

న్యూస్ డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు తీవ్రంగా దెబ్బతిగే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్యాలుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు ప్రకటించాయి.

తాజాగా ఆప్ పార్టీ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. రానున్న బీహార్ ఎన్నికలతో పాటు అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరవాత కూటమికి ఇక అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ నేత అభిషేక్ బెనర్జీ మాత్రం ఆన్‌లైన్ సమావేశానికి హాజరవుతారని స్పష్టం చేశారు.

ఈ పరిస్థితుల్లో, కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమి ఐక్యతే శక్తి అని చెబుతున్నారు. శనివారం ఆన్‌లైన్ సమావేశం తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షంగా భేటీ అవుతామని స్పష్టం చేశారు.

ఇకపోతే, బీహార్ ఎస్ఐఆర్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడులపై నేతలు చర్చించనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular