ఏపీ: తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సమయంలో తలెత్తుతున్న వివాదాలపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. థియేటర్ల బంద్ వెనుక కుట్ర ఉందన్న అనుమానాలను ఆయన బలంగా ప్రస్తావించారు.
“గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుశ్చర్యలకు సినీ పరిశ్రమ మౌనంగా నిలిచింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరైంది కాదు,” అని దుర్గేశ్ అన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాల పైనే సమస్యలు ఎందుకు వస్తున్నాయో తేల్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
“థియేటర్ యజమానులు లీజులపై ఆధారపడటమే ప్రస్తుతం పెద్ద సమస్య. ప్రత్యేకంగా పవన్ సినిమాల వేళే సమస్యలు రావడం అనుమానంగా ఉంది. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి నిగ్గు తేలుస్తాం,” అని తెలిపారు.
సినిమా పరిశ్రమకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విభిన్న సంఘాలు కలిసొస్తే మాత్రమే స్పందిస్తామని దుర్గేశ్ స్పష్టం చేశారు. “రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ పవన్ చెప్పిన ఆవేదన అర్థవంతమే. కానీ దీనికి తగిన స్పందన ప్రభుత్వం ఇస్తుంది,” అని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో కలకాలం నిలిచే పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన సినిమా పాలసీపై దృష్టిసారించనుందని ఆయన హామీ ఇచ్చారు.