
న్యూస్ డెస్క్: 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా, ముఖ్యంగా ఎక్స్ వేదిక, ఫన్నీ మీమ్స్‌తో నిండిపోయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ బహుమతి దక్కకపోవడంతో, ఆయనపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు.
నోబెల్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్‌కు నిరాశ ఎదురైందని, ఆయన ‘ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి?’ అంటూ బాధపడుతున్నారని ఫన్నీ క్యాప్షన్లతో మీమ్స్ వేగంగా వైరల్ అయ్యాయి.
ట్రంప్ నిరాశను వ్యక్తపరిచేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా యూజర్లు పంచుకున్నారు. ఆయన ‘మనశ్శాంతి కరువైందే’ అంటూ ఫన్నీ క్యాప్షన్లతో ‘ఇంటర్నెట్ గోల్డ్’ సృష్టించారు. తనకు ప్రైజ్ రాదని బయటకు చెప్పినా, లోపల ఉన్న చిన్న ఆశ ఈ ప్రకటనతో సమాధి అయిందని, అందుకే వచ్చే ఏడాది ట్రంప్ ఏం చేస్తారోనని నెట్టింట చర్చ జరుగుతోంది.
ఈ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని వెనిజుయెలా ప్రధాన ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది.
మాచాడోకు ‘వెనిజుయెలా ఐరన్ లేడీ’గా పేరు ఉంది. ఆమె 2025లో టైమ్ మాగజైన్ రూపొందించిన ‘The 100 Most Influential People’ జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు.
బహుమతి ప్రకటనకు ముందు నుంచే ట్రంప్ తనకు నోబెల్ రావాలని బలంగా ఆశించారు. ఇజ్రాయెల్ హమాస్, ఆర్మీనియా అజర్బైజాన్, ఇండియా పాకిస్తాన్ సహా అనేక అంతర్జాతీయ ఘర్షణలను తాను మధ్యవర్తిత్వం చేశానని, శాంతి యత్నాలలో పాలుపంచుకున్నట్లు ఆయన ప్రచారం చేసుకున్నారు.
అయితే, రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ట్రంప్ వాదనల నిజసత్యాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనకు బహుమతి దక్కకపోవడం, సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో మరింత ట్రెండింగ్‌లోకి మారింది.
